వైకల్యం ఉన్న పిల్లల విద్య కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మొట్టమొదటి పథకం ఏది?
- (1)SSA
- (2)IEDC
- (3)IEDSS
- (4)RMSA
సమాధానం, వివరణ
సరైన సమాధానం: (2) IEDC
IEDC (వైకల్యం ఉన్న పిల్లలకు సమైక్య విద్య) 1974 లో మొదలైంది. వైకల్యం ఉన్న పిల్లల విద్య కోసం కేంద్రం తెచ్చిన మొదటి పథకం ఇదే.
SSA 2000-01 లో, RMSA మార్చి 2009 లో, IEDSS 2009-10 లో వచ్చాయి. ఇవన్నీ IEDC తర్వాత వచ్చిన పథకాలే.