"వ్యక్తి తన జీవితాన్ని తానే నడుపుకోవడానికి, సొంత దృక్పథం ఏర్పరచుకోవడానికి, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, తన బరువు తానే మోయడానికి సమర్థులైన వారు అందించే సహాయమే మార్గదర్శనం" అని నిర్వచించినవారు
- (1)జోన్స్
- (2)క్రో అండ్ క్రో
- (3)ట్రాక్స్‌లర్
- (4)నాప్
సమాధానం, వివరణ
సరైన సమాధానం: (2) క్రో అండ్ క్రో
సొంత జీవితం, సొంత దృక్పథం, సొంత నిర్ణయాలు, సొంత బరువు అనే నాలుగు మాటలతో మార్గదర్శనాన్ని నిర్వచించినవారు క్రో అండ్ క్రో. ఏ వయసు వ్యక్తికైనా ఈ సహాయం అందుతుందని వారు చెప్పారు.
జోన్స్ దృష్టి వ్యక్తి మీద ఉంటుంది, సమస్య మీద కాదు అన్నారు. ట్రాక్స్‌లర్ పరిణత స్వీయ మార్గదర్శనం గురించి చెప్పారు. నాప్ మార్గదర్శన అంశాలను వివరించారు.